News February 7, 2025

DON’T MISS.. నెలకు రూ.15,000 స్టైఫండ్‌తో శిక్షణ

image

బీటెక్, BE, BSc Engg, ఎంటెక్, MSc, MBA, MA విద్యార్థులకు IIT మద్రాస్ శుభవార్త చెప్పింది. వారు నైపుణ్యాలను పెంచుకునేందుకు 2 నెలలపాటు(మే 19 నుంచి జులై 18 వరకు) సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అమలు చేయనుంది. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైఫండ్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి <>https://ssp.iitm.ac.in/<<>>ను సంప్రదించగలరు.

Similar News

News September 15, 2025

కేటీఆర్‌లా బెదిరింపు దావాలు వేయను: బండి

image

TG: KTR తనపై వేసిన <<17719172>>పరువునష్టం దావా<<>>పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్‌‌లా బెదిరింపుల కోసం దావాలు వేయను. దావా వేయాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్ బయటికే రారు. మీరు తిట్టని తిట్లు లేవు. నేను లవంగం తింటే తంబాకు అన్నావ్. నన్ను వాడు, వీడు అన్నావ్. మీ అయ్య నా తల ఆరు ముక్కలు నరుకుతా అన్నాడు. వీటన్నింటిపై పరువు నష్టం దావా వేయరాదా?’ అని బండి ప్రశ్నించారు.

News September 15, 2025

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్!

image

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, ఈ ఏడాది అక్టోబర్/నవంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు NDTV పేర్కొంది. లాంగ్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నారని రాసుకొచ్చింది. కత్రినా చివరిగా విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్మస్’ మూవీలో నటించారు. కాగా 2021లో విక్కీ, కత్రినా రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు.

News September 15, 2025

దూబే ఉంటే టీమ్ ఇండియాకు ఓటమి దూరం!

image

టీమ్ ఇండియా క్రికెటర్ శివమ్ దూబే అరుదైన రికార్డు నెలకొల్పారు. వరుసగా 31 టీ20 మ్యాచుల్లో ఓటమెరుగని క్రికెటర్‌గా నిలిచారు. ఆయన ఆడిన గత 31 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో నిన్న జరిగిన మ్యాచులోనూ ఈ పరంపర కొనసాగింది. 2020లో న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతోంది. 31 మ్యాచుల్లో 25 గెలవగా నాలుగు టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు.