News February 7, 2025
ఢిల్లీలో హైడ్రామా: కేజ్రీవాల్ ఇంటికి ACB టీమ్

ఢిల్లీ రాజకీయాలు ముదురు పాకాన పడుతున్నాయి. BJP ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని LG వీకే సక్సేనా ACBని ఆదేశించారు. నిర్ణీత కాల వ్యవధిలోనే దర్యాప్తును పూర్తి చేయాలని సూచించారు. దీంతో అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పయనమయ్యారు. 16 మంది ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.15 కోట్ల చొప్పున ఇస్తామంటూ బీజేపీ ఎరవేసిందని నిన్న AK ఆరోపించారు. దీనిని ఖండించిన కమలం పార్టీ ACBకి ఫిర్యాదు చేసింది.
Similar News
News April 9, 2026
‘ఆంటీ’ అన్నారని కోర్టుకు.. రూ.1.8 లక్షల ఫైన్

ఆంటీ అని పిలిచారని లండన్‌లో భారత సంతతి మహిళ ఇల్డా ఎస్టెవ్స్(61) కోర్టుకెక్కి విజయం సాధించారు. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్(NHS)లో నర్సుగా పనిచేస్తున్నారు. తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తోటి ఉద్యోగి ఆంటీ అంటూ వేధించారని, ఇది వయో, లింగ వివక్ష కిందకి వస్తుందని కేసు పెట్టారు. విచారించిన కోర్టు ఆమెకు నష్టపరిహారంగా ₹1.8 లక్షలు చెల్లించాలని NHSను ఆదేశించింది.
News April 9, 2026
పాక్ నమ్మదగిన మీడియేటర్ కాదు: ఇజ్రాయెల్

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేశామని పాకిస్థాన్ చెప్పుకుంటోంది. అయితే మీడియేటర్‌గా ఆ దేశ విశ్వసనీయతపై భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ సందేహాలు వ్యక్తం చేశారు. పాక్ నమ్మదగిన మధ్యవర్తి కాదని చెప్పారు. వాషింగ్టన్ సొంత కారణాలతో వ్యూహాత్మకంగా పాక్‌ను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చిందన్నారు. గతంలో హమాస్‌తో డీల్ కోసం ఖతర్, తుర్కియేను US ఎలా వాడుకుందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.
News April 9, 2026
10-15 నిమిషాల్లో తినేస్తున్నారా?

సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం. దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట.
Share It


