News March 19, 2024
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16మంది వాలంటీర్లపై వేటు

‘సిద్ధం’ సభలో పాల్గొన్నారని 16మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన 16మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఎంపీడీవో కె.లక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్నందుకు వీరిపై చర్యలు తీసుకున్నామన్నారు.
Similar News
News March 13, 2026
రాజమండ్రిలో అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్

చర్లపల్లి-కామాఖ్య అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా కనెక్టివిటీ లభించింది. ఈ రైలు శుక్రవారం మార్చి 13 నుంచి రాజమండ్రి స్టేషన్‌లో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, విజయనగరం జంక్షన్ వంటి నగరాలను ఈ రైలు అనుసంధానిస్తోంది. దీనివల్ల జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడంతో పాటు కామాఖ్య ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.

జాతీయ టీటీ పోటీలకు రాజమండ్రి వైష్ణవి సూర్య ఎంపిక

ఇండోర్‌లో మార్చి 14 నుంచి 21 వరకు జరగనున్న 87వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలకు రాజమండ్రి క్రీడాకారిణి వై. వైష్ణవి సూర్య ఎంపికయ్యారు. ర్యాంకింగ్ పోటీల పాయింట్ల ఆధారంగా రాష్ట్ర సీనియర్ మహిళల జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. గురువారం జిల్లా టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు జెవీవీ అప్పారెడ్డి, కోశాధికారి కె.సత్యనారాయణ, కోచ్ సుబ్బారావు ఆమెను అభినందించారు.