News February 7, 2025
మేడారం భక్తులకు బ్యాటరీ ఆఫ్ టాప్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738917985274_51702158-normal-WIFI.webp)
మేడారం మినీ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో బ్యాటరీ ఆఫ్ టాప్స్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనం అనంతరం భక్తులు సమీపంలోని అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో వనభోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నల్లాలను, చేతిపంపులను సైతం ఏర్పాటు చేశారు. కాగా, నీటిని వృథా చేయొద్దని సూచించారు.
Similar News
News February 7, 2025
రేపు 11 కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738931687155_51355545-normal-WIFI.webp)
జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్(JNVST) వరంగల్ జిల్లాలోని 11 సెంటర్లలో శనివారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవోదయ పరీక్ష నిర్వహిస్తున్న ఈ 11 పాఠశాలలకు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రేపు సెలవు ప్రకటించారు.
News February 7, 2025
గ్రేట్.. ఆరు నెలల బోనస్ ఇచ్చిన స్టార్టప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738924061593_746-normal-WIFI.webp)
ఉద్యోగుల విధేయతను గౌరవిస్తూ ఓ కంపెనీ వారికి 6 నెలల జీతాన్ని బోనస్‌గా ఇచ్చింది. TNలోని కోయంబత్తూరులో ఉన్న AI స్టార్టప్ ‘KOVAI.CO’ను శరవణ కుమార్ స్థాపించారు. మొత్తం 140 మంది ఉద్యోగులుండగా, వారికి రూ.14 కోట్లు బోనస్‌గా ఇచ్చారు. ‘స్టార్టప్‌లలో పనిచేసేందుకు ఎవరూ మొగ్గుచూపారు. మూడేళ్లు మాతో పనిచేస్తే 2025 జనవరి జీతంలో ఆరు నెలల బోనస్ ఇస్తానని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకున్నా’ అని శరవణ కుమార్ తెలిపారు.
News February 7, 2025
ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738934238325_81-normal-WIFI.webp)
మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.