News February 7, 2025
‘లైలా’ ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ సినిమా ఈనెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఇప్పటికే విశ్వక్‌తో పాటు ‘లైలా’ నిర్మాత చిరును కలిసి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు.
Similar News
News March 22, 2026
సమ్మర్‌లో చికెన్ తింటున్నారా?

సమ్మర్‌లో మితంగా చికెన్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఇది అధిక ప్రొటీన్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమై శరీర వేడిని పెంచుతుంది. దీంతో తలనొప్పి, కళ్ల మంటలు, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చికెన్‌ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ రెండుమూడు సార్లు తీసుకుంటే బరువు పెరుగుతారు’ అని హెచ్చరిస్తున్నారు.
News March 22, 2026
కాబోయే తండ్రుల్లోనూ ‘ప్రెగ్నెన్సీ’ లక్షణాలు

గర్భిణుల్లో వాంతులు, అలసట, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, బరువు పెరగటం సహజం. కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు భర్తల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే Couvade సిండ్రోమ్ అంటారు. భాగస్వామితో బలమైన భావోద్వేగ అనుబంధం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20% మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. కొందరు పురుషుల్లో హార్మోన్ల మార్పులూ జరుగుతాయని పేర్కొంటున్నారు.
News March 22, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు!

తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. Hydలో కూడా స్వల్పంగా వర్షం పడొచ్చని, ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వివరించింది.


