News February 7, 2025
సీఎంతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
Similar News
News March 7, 2026
సివిల్స్‌లో సత్తా చాటిన వైభవ్ మేనమామ

టాలెంటెడ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మేనమామ అభిషేక్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే 102వ ర్యాంకు సాధించారు. దీంతో అల్లుడు క్రికెట్‌లో, మామ సివిల్స్‌లో అదరగొట్టారని పలువురు ప్రశంసిస్తున్నారు. 27 ఏళ్ల అభిషేక్ స్వస్థలం బిహార్‌లోని రాజజన్ గ్రామం. ఎంటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అతను 2022 నుంచి సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. అభిషేక్ తండ్రి అభయ్ నలంద ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్.
News March 7, 2026
జాగ్రత్త.. రేపు అన్ని జిల్లాల్లో 36°C-40°C

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3°C-4°C డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో 36°C-40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38°C-40°C మధ్య టెంపరేచర్ నమోదైందని తెలిపింది.
News March 7, 2026
ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామాల్లో 3.60L ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో లక్ష యూనిట్లకు ఈ నెల 31లోగా గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులను నిలిపేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకూ అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. APRలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.


