News March 19, 2024
మిర్యాలగూడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటనలో మిర్యాలగూడ మండలంలో సోమవారం జరిగింది. దామరచర్ల మండలం లావూరి భూక్య తండా గ్రామానికి చెందిన భూక్య నాగు తన స్నేహితుడు దావీదుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా కిష్టాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నాగు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై మృతుడి బావ సైదులు ఫిర్యాదుతో నేడు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
Similar News
News July 6, 2025
NLG: విద్యాశాఖ సతమతం.. రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడ!?

జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలోని అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలనే ఇన్చార్జ్ ఎంఈవోలుగా నియమించారు. దీంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పని ఒత్తిడితో ఇంచార్జ్ ఎంఈఓలు సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
News July 6, 2025
NLG: రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

KGBVలో ప్రత్యేక అధికారులు, PGCRTలు, CRTలు, పీఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులతో పాటు అదేవిధంగా టీజీ MSGHలో ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈ నెల 7వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. 1:1 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.
News July 6, 2025
నిరాశ పరిచిన జూన్.. రైతన్నను వెంటాడుతున్న కష్టాలు

నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయని.. మంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు సంతోషించారు. జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వ్యవసాయం మందగించిపోతుంది. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మోస్తరు వర్షాలే తప్ప.. భారీ వర్షం జాడ కానరావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.