News February 7, 2025

PPM: మన్యం జిల్లా ఆశావాహ జిల్లాల్లో అగ్రస్థానంలో ఉండాలి

image

పార్వతీపురం మన్యం దేశంలోని ఆశావాహ జిల్లాల్లో అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆశావాహ జిల్లాల విభాగంలో పార్వతీపురానికి ప్రధానమంత్రి అవార్డు రావాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది భామిని బ్లాక్‌ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తిని బ్లాక్‌తో పాటు జిల్లాలోనూ కొనసాగించాలన్నారు.

Similar News

News April 1, 2026

కృష్ణా: గ్యాస్ పంపిణీపై GOOD NEWS..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ పంపిణీ చేయనున్నారు. 20% హాస్టల్స్, టెంపుల్స్, స్కూల్స్ కాగా, మిగిలిన 50% హోటల్స్‌కి కేటాయిస్తారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్‌కు అప్లై చేసున్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. VJAలో 10 వేల గృహాలకు PNG కనెక్షన్స్ ఉండగా, 100 హోటల్స్ కనెక్షన్ పొందాయి. కృష్ణాజిల్లాలో 467 పరిశ్రమలు, 179 ఆసుపత్రులు, 9 మెయిన్ టెంపుల్స్‌లో PNG గ్యాస్ కనెక్షన్స్ లేవన్నారు.

News April 1, 2026

గుంటూరు: పన్ను వసూళ్లలో GMC రికార్డ్

image

గుంటూరు నగరపాలక సంస్థ 90%కి పైగా పన్ను వసూళ్లతో రికార్డు సృష్టించింది. గతేడాది రూ.152.14 కోట్లు వసూళ్లు రాగా.. ఈ ఏడాది మాత్రం రూ.155.20 కోట్లు రాబట్టినట్లు కమిషనర్ కే.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరిరోజు రూ.9 కోట్ల వసూళ్లతో నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.

News April 1, 2026

‘ధురంధర్-2’ స్టోరీ నాదే.. కాపీ కొట్టారు: కన్నడ డైరెక్టర్

image

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘ధురంధర్-2’కు ఇప్పుడు కొత్త వివాదం చుట్టుకుంది. తన స్టోరీనే కాపీ కొట్టి సినిమా తీశారని కన్నడ డైరెక్టర్ ఆర్ఎస్ సంతోష్ కుమార్ ఆరోపించారు. 2023లోనే స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించానని.. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ వంటి బడా నిర్మాణ సంస్థలకు కథ వినిపించానని తెలిపారు. ఇటీవల సినిమా చూడటంతో విషయం తెలిసిందని.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు.