News February 7, 2025
విశాఖ: ఎమ్మెల్సీ స్థానానికి మరో మూడు నామినేషన్లు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం మూడు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు సంబంధిత పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు చేశారు. వారిలో నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News December 31, 2025
వరంగల్: SBI ట్రేడింగ్ పేరుతో రూ.37 లక్షల సైబర్ మోసం!

SBI ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ప్రైవేట్ లెక్చరర్‌ను మోసం చేశారు. ఫేస్‌బుక్‌లో స్టాక్ మార్కెట్ లాభాల ప్రకటన నమ్మి లింక్ క్లిక్ చేసిన బాధితుడిని SBI Securities పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి నకిలీ యాప్ ఇన్‌స్టాల్ చేయించారు. 20% లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి, డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఫీజు అంటూ మొత్తం రూ.37,11,536 దోచుకున్నారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
News December 31, 2025
జపాన్‌ను దాటేసి.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా

భారత్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. జపాన్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన ఎకానమీ విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 లోపు జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లలో 7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామని తెలిపింది. 2025-26 రెండో క్వార్టర్‌లో రియల్ GDP 8.2% వృద్ధి చెందిందని వెల్లడించింది.
News December 31, 2025
ప్రతిపక్ష నేత, ఉప నేత నడికూడ మండలానికి చెందిన వారే!

BRS శాసనమండలి పక్ష ఉప నేతలుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ అధినేత KCR నియమించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి ఉన్నారు. కాగా, ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఉపనేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ హనుమకొండ జిల్లాలోని నడికూడ మండలానికి చెందిన వారే కావడం విశేషం.


