News February 7, 2025
జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
Similar News
News January 1, 2026
అంతర్వేది బీచ్‌లోకి దూసుకెళ్లిన కారు.. కాకినాడ యువకుడు గల్లంతు

సఖినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్‌లో బుధవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. కాకినాడకు చెందిన ఇద్దరు యువకులు కారులో ఉండగా.. కిషన్‌ను స్థానికులు రక్షించారు. శ్రీధర్(35) అనే వ్యక్తి అలల ఉధృతికి గల్లంతయ్యాడు. బీచ్‌లో డ్రైవింగ్ చేస్తుండగా ఈప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. రక్షింపబడిన యువకుడిని రాజోలు ఆసుపత్రికి తరలించారు. శ్రీధర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
News January 1, 2026
మహబూబాబాద్‌లో పులి.. నిఘా పెంపు.!

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పులి అలజడి మొదలైంది. గంగారం, కొత్తగూడ మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించాయి. రాంపూర్, ఓటాయి, కర్ణగండి గ్రామస్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. అయితే, పులులు తోడు కోసం ఈ సమయంలో అటవీ ప్రాంతాలకు రావడం సహజమేనని ఫారెస్ట్ అధికారులు భరోసా ఇస్తున్నారు. రైతులు, పశువుల కాపరులు అడవి వైపు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
News January 1, 2026
నల్గొండ: 25 జీపీల్లో నూతన అకౌంట్లు

నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పడిన 25 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బ్యాంక్ అకౌంట్లు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మూడు అకౌంట్లు తెరవాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒక అకౌంట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం నిధులకు మరో అకౌంట్‌తో పాటు గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి మూడో అకౌంట్ తీయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త పంచాయతీల్లో కొత్త అకౌంట్లు తెరిచారు.


