News February 7, 2025
నంద్యాల జిల్లాలో యూరియా కొరత!

నంద్యాల జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాల్లో యూరియా లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కళ్లు గప్పి కొందరు డీలర్లు యూరియా బస్తాలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి రైతుసేవ కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News September 17, 2025
తిరుపతి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు

మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా చిల్డ్రన్ హోమ్స్, వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం పేర్కొంది. శ్రీకాళహస్తిలో 7, కోటలో 2, SAA యూనిట్‌లో 5, DCPU యూనిట్‌లో ఓ పోస్టుతో పాటు మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. కేవలం మహిళలే అర్హులు. ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు. చివరి తేదీ సెప్టెంబర్ 19.
News September 17, 2025
సంచలన తీర్పులకు కేరాఫ్.. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు

నల్గొండ పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి N.రోజారమణి తన తీర్పులతో తప్పు చేయాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జులై 4 నుంచి ఈ నెల 16 వరకు పది పోక్సో కేసుల్లో తీర్పులిచ్చారు. వీటిలో ఒక కేసులో దోషికి ఉరి శిక్ష, మిగిలిన కేసుల్లో కనీసం 20 ఏళ్లకు తగ్గకుండా శిక్షలు విధించారు.
News September 17, 2025
HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.