News February 7, 2025
గూడూరు: పుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన హరీశ్ రావు

గూడూరు మం. దామరంచ గురుకులంలో జరిగిన పుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ‘దామరంచ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ఇలాంటి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఎక్కడి గొంగళి అక్కడే వేసినట్లుంది. రేవంత్ రెడ్డి మీ మాటలు కోటలు దాటుతాయి తప్ప ఆచరణ గడప దాటడు అని చెప్పడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం’ అని ‘X’ వేదికగా రాసుకొచ్చారు.
Similar News
News March 22, 2026
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ

మహబూబ్‌నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ శనివారం సమావేశమయ్యారు. విశ్వకర్మ, గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. స్వర్ణకారులకు రుణ సదుపాయాల కల్పనతో పాటు, వారి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
News March 22, 2026
నేడు సిద్దిపేట పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న ‘రైతు ఉత్సవాలు’ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సుమారు ₹300 కోట్లతో నిర్మించిన TG ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. ఇదే వేదికగా రైతు భరోసా మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.
News March 22, 2026
అల్లు అర్జున్-అట్లీ మూవీలో అనుష్క శర్మ?

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీ కాస్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ఇప్పటికే దీపికా పదుకొణె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఈ సినిమాతో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ మూవీ టీజర్ ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.


