News February 7, 2025

ట్విస్ట్.. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా హార్దిక్?

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ODI, T20 కెప్టెన్సీ ఇవ్వాలని BCCI యోచిస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. బాగా రాణిస్తున్నప్పటికీ అతడికి అన్యాయం జరుగుతోందనే భావనలో కోచ్ గంభీర్, బోర్డు అధికారులున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే ODIలకు హార్దిక్‌ను కెప్టెన్ చేయాలని, T20ల్లో సూర్య బ్యాటింగ్‌లో విఫలమవుతున్న నేపథ్యంలో ఆ పగ్గాలు కూడా పాండ్యకే ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 7, 2025

జగన్ మరీ దిగజారిపోయారు: షర్మిల

image

AP: మాజీ సీఎం మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. క్యారెక్టర్ ఏంటో ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ‘వైఎస్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా విజయసాయిరెడ్డితో నా క్యారెక్టర్‌పై నీచంగా మాట్లాడించారు. వైఎస్ కోరికలకు విరుద్ధంగా అబద్ధం చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి తీసుకువచ్చి చెప్పించారు. ఇదీ జగన్ మహోన్నత వ్యక్తిత్వం’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News February 7, 2025

ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం

image

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

News February 7, 2025

అయోధ్య ఆలయ దర్శన సమయం మార్పు

image

అయోధ్య రాముడి దర్శనం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించనున్నట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉదయం 7గంటలకు ఆలయాన్ని తెరుస్తుండగా.. భక్తులు అధికంగా వస్తుండటంతో దర్శన సమయాలు మార్చినట్లు తెలిపారు. రాముల వారికి ఉదయం 4గంటలకు మంగళహారతి, 6గంటలకు ‘శ్రింగార్ హారతి’ ఇచ్చిన అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి పదిగంటల వరకూ స్వామివారిని దర్శించుకోవచ్చు.

error: Content is protected !!