News February 7, 2025

కుటుంబంతో రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన సచిన్

image

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని అతిథి గృహాన్ని కుటుంబంతో కలిసి సందర్శించడం తనకు దక్కిన గౌరవమని మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించిన ఆతిథ్యం దీనిని మరింత ప్రత్యేకం చేసింది. విందులో హృదయపూర్వక సంభాషణలు నన్ను మరింత ప్రభావితం చేశాయి. ఈ అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి దాని గొప్పతనం, వారసత్వాన్ని తెలుసుకోండి’ అని తెలిపారు.

Similar News

News February 7, 2025

బీసీ నేతలతో కేటీఆర్ భేటీ

image

TG: అందుబాటులో ఉన్న బీసీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో ఆయన సమావేశమై బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

News February 7, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

TG: రెండో శనివారం సందర్భంగా రెగ్యులర్‌గా రేపు స్కూళ్లకు సెలవు ఉంటుంది. అయితే కొన్ని స్కూళ్లు సెలవును రద్దు చేశాయి. రేపు స్కూలుకు రావాలని హైదరాబాద్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పంపాయి. విద్యా సంవత్సరం ముగియనుండటం, సిలబస్ పూర్తి కాకపోవడం, స్కూలు పనిదినాలు తగ్గడం సహా పలు కారణాలతో FEB 8న సెలవును రద్దు చేశాయి. మరి రేపు సెలవు లేదని మీ స్కూలు నుంచి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News February 7, 2025

ప్రధానితో భేటీపై నాగార్జున ట్వీట్

image

ప్రధాని మోదీతో భేటీపై నాగార్జున స్పందించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించడంపై నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బుక్‌ను మోదీకి అందించడం గౌరవంగా భావిస్తున్నానని, ఇది తన తండ్రి సినీ వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆయన సేవలను మోదీ గుర్తించడం తమ కుటుంబం, దేశ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున పేర్కొన్నారు.

error: Content is protected !!