News February 7, 2025

జనగామ: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను నాణ్యతతో చేయించాలని, ఈనెల 15లోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలని అదే విధంగా పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు.

Similar News

News March 25, 2026

గతేడాది నుంచి ఒక్క T20 ఆడని శ్రేయస్, పంత్!

image

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, LSG కెప్టెన్ పంత్ IPLలో ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది. గత సీజన్ నుంచి వీరిద్దరూ ఇప్పటివరకు ఒక్క T20 మ్యాచ్ ఆడకపోవడమే అందుకు కారణం. గతేడాది ఆసీస్ టూర్‌లో తీవ్రంగా గాయపడ్డ శ్రేయస్ తర్వాత కోలుకొని కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. కానీ ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు. T20 WCకూ ఎంపిక కాలేదు. ఇక పంత్ గతేడాది నుంచి టెస్టులకు ప్రాతినిధ్యం వహించినా T20లు ఆడలేదు.

News March 25, 2026

KNR: వదంతులు నమ్మొద్దు.. పుష్కలంగా ఇంధనం: సీపీ

image

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా సక్రమంగా జరుగుతోందని స్పష్టం చేశారు. భయంతో ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంధనం లభ్యత విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని సీపీ సూచించారు.

News March 25, 2026

GK: భారత చరిత్రలో మొట్టమొదటి వ్యక్తులు

image

⋆ తొలి రాష్ట్రపతి- డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
⋆ తొలి ప్రధాని- జవహర్‌లాల్ నెహ్రూ, * తొలి మహిళా రాష్ట్రపతి-ప్రతిభా పాటిల్
⋆ తొలి మహిళా PM-ఇందిరా గాంధీ
⋆ ఉపరాష్ట్రపతి-డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
⋆ అంతరిక్ష యాత్రికుడు-రాకేష్ శర్మ
⋆ నోబెల్ బహుమతి గ్రహీత-రవీంద్రనాథ్ ఠాగూర్
⋆ మహిళా IPS కిరణ్ బేడీ, మహిళా గవర్నర్-సరోజినీ నాయుడు ⋆ లోక్‌సభ మొదటి స్పీకర్-జి.వి.మౌలాంకర్
⋆ లోక్‌సభ మహిళా స్పీకర్-మీరా కుమార్