News February 7, 2025

అత్యధిక విద్యావంతులున్న దేశాలివే!

image

ప్రపంచంలోనే జపాన్‌లో అత్యధికంగా విద్యావంతులు ఉన్నట్లు తాజాగా విడుదలైన ఓ నివేదికలో వెల్లడైంది. ఇండియా 53వ స్థానంలో ఉండగా చైనా 27, అమెరికా 22వ స్థానాల్లో ఉన్నాయి. విద్యావంతులు కలిగిన దేశాల జాబితా వరుసగా.. జపాన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జెర్మనీ, డెన్మార్క్, కెనడా, నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఐర్లాండ్, ఇటలీ, USA, స్పెయిన్, చైనా, రష్యా, UAE ఉన్నాయి.

Similar News

News February 7, 2025

ఐదేళ్ల క్రితం రూ.8.7 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.2.4 కోట్లు!

image

స్టాక్ మార్కెట్‌‌లో విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. ఐదేళ్ల క్రితం 10వేల డాలర్లు(రూ.8.7లక్షలు) సేవింగ్స్ అకౌంట్‌లో భద్రపరిస్తే అది రూ.8.96 లక్షలు అయ్యేది. అదే డబ్బును స్టాక్ మార్కెట్‌లో Nvidiaలో ఇన్వెస్ట్ చేస్తే $285,000 (రూ.2.4కోట్లు), Bitcoinలో చేస్తే $220,000, Teslaలో చేస్తే $139,000 అయ్యేవి.
నోట్: ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు పాటించాలి.

News February 7, 2025

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘తండేల్’ మూవీ

image

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీని పైరసీ వెంటాడింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే ఆన్‌లైన్ HD ప్రింట్ అందుబాటులోకి రావడంతో అభిమానులు, ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇది చాలా బాధాకరమని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడాలంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి.

News February 7, 2025

నీట్- UG పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

image

నీట్- యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. మే 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి NTA ఈ పరీక్ష నిర్వహించనుంది.

error: Content is protected !!