News February 7, 2025
కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు: JC

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జేసీ నిషాంతి తెలిపారు. శుక్రవారం కళ్యాణ వేదిక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లు, మినీ కంట్రోల్ రూమ్, బీచ్ పాయింట్, స్నాన ఘట్టాలు ఆమె పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి 12.55 గంటలకు కళ్యాణం జరుగుతుందన్నారు. నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని చెప్పారు.
Similar News
News March 28, 2026
మాచర్ల: APRDC సెట్ గడువు పొడిగింపు

నాగార్జునసాగర్‌లోని ఏపీఆర్డీసీ డిగ్రీ కళాశాల ప్రవేశ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. నయీమ్ భాను తెలిపారు. ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీల్లోని వివిధ నూతన కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
News March 28, 2026
NZB: పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దాం: మహేష్ కుమార్

ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని, నిజామాబాద్ నగర అభివృద్దే ధ్యేయంగా అందరం పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ సూచించారు. శుక్రవారం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు.
News March 28, 2026
భద్రాచలం: గిరిజన ఉత్పత్తులపై గవర్నర్ ఆరా..!

భద్రాచలం గిరి మార్ట్‌ను సతీసమేతంగా తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్ల ప్రారంభించారు. అటవీ ఉత్పత్తులు, సేంద్రియ ఆహార పదార్థాలు, గిరిజన హస్తకళ వస్తువులను ఒకే వేదికపై విక్రయానికి అందుబాటులో ఉంచడం ద్వారా గిరిజనులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. గిరిజన ఉత్పత్తులను సతీసమేతంగా పరిశీలించి, వాటి ప్రత్యేకతలు, తయారీ విధానం, మార్కెటింగ్ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.


