News February 7, 2025

వివేకా కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?: దస్తగిరి

image

AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడపలో విచారణ అధికారి 3గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది జైలులో తనను ఇబ్బందులు పెట్టారని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. దస్తగిరి మాట్లాడుతూ.. ‘వివేకా హత్య కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ప్రభుత్వానికి ఈ కేసు సవాల్ లాంటిది’ అని అన్నారు.

Similar News

News March 14, 2026

కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: మంత్రి

image

AP: పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857కు కాల్ చేయాలన్నారు. కల్తీపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని ట్వీట్ చేశారు.

News March 14, 2026

2027 FEB వరకు టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

image

☛ ఈ ఏడాది జూన్ 6-20 వరకు AFGతో 1టెస్ట్, 3 వన్డేలు, ఆ తర్వాతి వారంలో IREతో 3 T20లు
☛ జులై 1-19 ENGతో 3వన్డేలు, 5 టీ20లు, JULY, AUGలో SLతో 3 టీ20లు, 2 టెస్టులు
☛ SEPలో AFGతో 3 టీ20లు, BANతో 3ODIs, 3 టీ20లు, ZIMతో 3 టీ20లు. ☛ SEP 25-OCT 3 ఏషియన్ గేమ్స్, WIతో 3 ODIs, 5 టీ20లు
☛ OCT-DECలో 5 ODIs, 5 టీ20లు, 2టెస్టులు, SLతో 3 ODIs, 3T20Is
☛ 2027 JAN-FEBలో AUSతో 5 టెస్టులు

News March 14, 2026

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

image

ప్రస్తుతకాలంలో వాషింగ్ మెషీన్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించడంలో కొన్ని టిప్స్ పాటిస్తేనే దుస్తులు, మెషీన్ మన్నిక బావుంటుంది. ☛ గట్టి, సున్నితమైన వస్తువుల్ని విడిగా జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి ఉతకాలి. ☛ క్విక్‌ వాష్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. ☛ గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌ వాడటం మంచిది. ☛ అయితే వేటిని ఉతకాలన్నా వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ బట్టి ఉతకాలి.