News February 7, 2025

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

image

AP: విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వైజాగ్‌లోని రూ.44.74 కోట్ల విలువైన హయగ్రీవ ఆస్తులు అటాచ్ చేసింది. కాగా వృద్ధులు, అనాథలకు సేవ చేసేందుకు కేటాయించిన హయగ్రీవ భూములను ఆయన దుర్వినియోగం చేసినట్లు ఈడీ గతంలో తేల్చింది. ప్లాట్లుగా విభజించి వేర్వేరు వ్యక్తులకు తప్పుడు పత్రాలతో విక్రయించినట్లు గుర్తించింది.

Similar News

News February 7, 2025

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘తండేల్’ మూవీ

image

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీని పైరసీ వెంటాడింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే ఆన్‌లైన్ HD ప్రింట్ అందుబాటులోకి రావడంతో అభిమానులు, ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇది చాలా బాధాకరమని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడాలంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి.

News February 7, 2025

నీట్- UG పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

image

నీట్- యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. మే 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి NTA ఈ పరీక్ష నిర్వహించనుంది.

News February 7, 2025

జగన్ మరీ దిగజారిపోయారు: షర్మిల

image

AP: మాజీ సీఎం మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. క్యారెక్టర్ ఏంటో ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ‘వైఎస్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా విజయసాయిరెడ్డితో నా క్యారెక్టర్‌పై నీచంగా మాట్లాడించారు. వైఎస్ కోరికలకు విరుద్ధంగా అబద్ధం చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి తీసుకువచ్చి చెప్పించారు. ఇదీ జగన్ మహోన్నత వ్యక్తిత్వం’ అని ఆమె ఫైర్ అయ్యారు.

error: Content is protected !!