News March 19, 2024

HYD: రూ.16,43,300 నగదు పట్టివేత: కమిషనర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్ టీమ్స్ మంగళవారం రూ.16,43,300 నగదుతో పాటు రూ.10,250 విలువగల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేశారని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పోలీస్, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ టీమ్స్ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 9, 2025

జూబ్లీ బైపోల్: వీరికి టెన్షన్.. వారికి ప్రశాంతం

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందర్భంగా కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మైకుల హోరుతో వీధులు, బస్తీలు దద్దరిల్లాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి ప్రచారం ముగియనుండటంతో ఈ గోల ఉండదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులు లేకుండా ఉంటారు. అయితే పోటీచేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు మాత్రం టెన్షన్‌తో ఉంటారు. ఎవరు.. ఎవరికి ఓటేస్తారో అర్థంకాక తలలు పట్టుకుంటారు.

News November 9, 2025

జూబ్లీ బైపోల్: అసలు అభ్యర్థులేమైనా మాట్లాడారా?

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో రోడ్‌షోలు నిర్వహించాయి. అంతటితో ఆగకుండా పార్టీ పెద్దలు వారి విజయం కోసం ప్రచారం చేశారు. అసలు విషయం ఏంటంటే ఈ పార్టీల అభ్యర్థులు ఓటర్లకేమైనా హామీలిచ్చారా? అసలు వీరిని బడా నాయకులు మాట్లాడనిచ్చారా? అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతా మీరే చేస్తే.. ఇక అభ్యర్థులెందుకు.. మీరే పోటీచేయొచ్చు కదా అని విమర్శిస్తున్నారు.

News November 9, 2025

నవీన్ యాదవ్ రౌడీ కాదు: CM రేవంత్

image

నవీన్ యాదవ్ రౌడీ కాదని CM రేవంత్ రెడ్డి అన్నారు. B.Arch చేసి, ప్రజా సేవలో ఉన్న యువకుడు నవీన్ అంటూ CM పేర్కొన్నారు. ‘తన తండ్రిని చూసి రౌడీ అన్ని ముద్ర వేస్తున్నట్లు నవీన్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. పాస్‌పోర్టు బ్రోకర్ కొడుకు ఏం అవుతారని కూడా ఆయన నిలదీశారు. దీనిపై BRS సమాధానం చెప్పాలి. టికెట్ ఇచ్చిన అని నేను ఏం చెప్పడం లేదు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెబుతారు’ అని CM రేవంత్ తెలిపారు.