News February 7, 2025

అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయంలో బెల్లంపల్లి విద్యార్థికి సీటు  

image

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో బెల్లంపల్లికి చెందిన ఆకునిరి రిషి చరణ్‌ ప్రతిభ కనబరిచి సీటు సాధించాడు. ఈ సందర్భంగా చరణ్‌‌ను బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సత్కరించారు. ఏసీపీ మాట్లాడుతూ.. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజీమ్ జీ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం బెల్లంపల్లి పట్నానికి గర్వకారణం అన్నారు. 

Similar News

News February 7, 2025

చొప్పదండి: నవోదయ పరిమిత సీట్ల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

image

చొప్పదండి నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతులలో పరిమిత సీట్లకు శనివారం జరిగే ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశానికి 1340 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 11వ తరగతిలో ప్రవేశానికి 1278 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ మంగతాయారు తెలిపారు. అభ్యర్థులు 10 గంటల లోపు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో హాజరు కావాలని ప్రిన్సిపల్ సూచించారు.

News February 7, 2025

అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో పోలీసులకు ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం జిల్లా కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ ఎస్పీ ముందు హాజరై వారి వ్యక్తిగత అనారోగ్య సమస్యలను తెలిపారు. ఈ మేరకు విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News February 7, 2025

ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌క్రియ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి: కలెక్టర్

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌క్రియ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలని అధికారుల‌ను విశాఖ క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు. నామినేష‌న్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వ‌సతుల క‌ల్ప‌న‌, జాబితాల త‌యారీ, సిబ్బంది కేటాయింపు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌న్నారు.

error: Content is protected !!