News February 7, 2025

NZB: కోటగల్లీలో అగ్ని ప్రమాదం, రెండిళ్లు దగ్ధం

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ మార్కండేయ మందిరం సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మధిర ప్రసాద్, సుమలత అనే ఇద్దరికి చెందిన ఇండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ఇండ్లలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.

Similar News

News April 15, 2026

నిజామాబాద్‌లో కఠిన నిబంధనలు: సీపీ

image

నిజామాబాద్‌ జిల్లాలో విగ్రహాల ప్రతిష్టాపన, డీజేలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 15, 2026

నేడు నిజామాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక

image

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.

News April 15, 2026

నిజామాబాద్: అంగన్‌వాడీ.. డిజిటల్ వే

image

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.