News February 7, 2025
యాదాద్రి: అడవి దున్న మృతి..
కొద్దిరోజులుగా జిల్లాలో హల్‌చల్ సృష్టించిన <<15388923>>అడవి దున్న<<>> మరణించింది. కొద్ది గంటల క్రితమే చాకచాక్యంగా దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్న అటవీ శాఖ అధికారులు అది మృతి చెందినట్లు తెలిపారు. కాగా, రెండు రోజుల నుంచి విపరీతంగా తిరగడంతో <<15386379>>దున్న <<>>అనారోగ్యానికి గురై చనిపోయిందని జిల్లా అధికారి పద్మజారాణి పేర్కొన్నారు. ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా పంచనామ నిర్వహించనున్నట్లు చెప్పారు.
Similar News
News February 7, 2025
పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనుండగా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తొలుత ZPTC, MPTC ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
News February 7, 2025
ఐదేళ్ల క్రితం రూ.8.7 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.2.4 కోట్లు!
స్టాక్ మార్కెట్‌లో విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. ఐదేళ్ల క్రితం 10వేల డాలర్లు(రూ.8.7లక్షలు) సేవింగ్స్ అకౌంట్‌లో భద్రపరిస్తే అది రూ.8.96 లక్షలు అయ్యేది. అదే డబ్బును స్టాక్ మార్కెట్‌లో Nvidiaలో ఇన్వెస్ట్ చేస్తే $285,000 (రూ.2.4కోట్లు), Bitcoinలో చేస్తే $220,000, Teslaలో చేస్తే $139,000 అయ్యేవి.
నోట్: ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు పాటించాలి.
News February 7, 2025
ADB: రేపు పాఠశాలలకు సెలవు లేదు: DEO ప్రణీత
రేపు రెండవ శనివారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు లేదని జిల్లా విద్యాధికారి ప్రణీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటిస్తూ ఫిబ్రవరి 8 రెండవ శనివారం పని దినంగా ఉంటుందని సర్కులర్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలను యదావిధిగా నడపాలని ప్రధానోపాధ్యాయులకు ఆమె సూచించారు.