News February 7, 2025
నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం

రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్‌షా కోట్‌లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2026
HYD: గ్యాస్ కొరత ఎక్కడ లేదు.. కలెక్టర్ల స్పష్టత..!

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కడ కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆయా జిల్లా కలెక్టర్లు హరిచందన, మనూ చౌదరి, నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు తగిన నిల్వలను ఉంచి, సమయానికి సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు
News March 28, 2026
HYD: సర్కారీ డేటాకు ‘సైబర్’ కన్నం..!

ప్రభుత్వ ఐటీ విభాగం భద్రతా వలయాన్ని ఛేదించి సైబర్ దొంగలు పడ్డారా? అంటే అవుననే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక థర్డ్ పార్టీ వెండర్ అజాగ్రత్త వల్ల సుమారు 20 లక్షల మంది వ్యక్తిగత సమాచారం ‘డార్క్ వెబ్’లో ప్రత్యక్షమైనట్లు ‘బ్రీచ్ ఆడిట్’ నివేదిక వెల్లడించింది. సమాచారం గల్లంతైన వార్తలతో అధికారులు హుటాహుటిన సెక్యూరిటీ ప్యాచ్‌లను అప్‌డేట్ చేస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టారు.
News March 28, 2026
‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి! <<7337592828>>7337592828<<>>


