News February 7, 2025

ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే’ అని విమర్శించారు.

Similar News

News February 8, 2025

పడుకునే ముందు ఇవి తాగుతున్నారా?

image

రోజూ పడుకునే ముందు కొన్ని పానీయాలు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి హాయిగా నిద్రపట్టేందుకు సహకరిస్తాయని అంటున్నారు. లావెండర్ టీ తాగితే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర కలుగుతుంది. చమోమిలే టీ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం కలిగి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. పిప్పరమెంట్ టీ కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. వేడి పాలలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే నాడీ వ్యవస్థ రిలాక్స్‌గా మారుతుంది.

News February 8, 2025

కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి

image

మరో బాలీవుడ్ నటి సన్యాసినిగా మారారు. నటి ఇషికా తనేజా కుంభమేళాలో సన్యాసం స్వీకరించారు. ఇకపై తాను సినిమాల్లో నటించనని పుణ్యస్నానం ఆచరించి ప్రతిజ్ఞ చేశారు. కాగా ఇషికా 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.

News February 7, 2025

జగన్ ఇంటి ముందు అగ్నిప్రమాదం.. కుట్ర కోణంలోనూ విచారణ

image

AP: తాడేపల్లిలోని మాజీ CM జగన్ ఇంటి ముందు జరిగిన అగ్నిప్రమాదంపై గుంటూరు SP సతీశ్ కుమార్ మాట్లాడారు. ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని, కుట్రకోణం ఉందేమో అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ నివాసంలోని రోడ్డులో ఉన్న CC కెమెరాలోని డేటాను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని SP వెల్లడించారు.

error: Content is protected !!