News February 7, 2025

తిరుమలలో దంపతుల ఆత్మహత్య

image

తిరుమలలో విషాద ఘటన జరిగింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్‌లో గురువారం రూము తీసుకున్నారు. నిన్నటి నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు ఇవాళ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News September 19, 2025

అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ RRR అసహనం

image

2వ రోజు అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ RRR అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి MLA కొణతాల రామకృష్ణ గళం వినిపిస్తుండగా .. విప్‌లు మాట్లాడుకుంటూ ఉండడాన్ని తప్పుబట్టారు. విప్‌లు కాస్త మాటలు తగ్గించాలన్నారు. అత్యవసరమైతే బయటికి వెళ్లిపోవాలని సూచించారు. అలా కాదని సభలో గందరగోళం సృష్టిస్తూ అంతరాయం కలిగించవద్దని మనవి చేశారు.

News September 19, 2025

ఇది కదా అసలైన మార్పంటే.. హరీశ్ రావు సెటైర్

image

TG: తాము మేడిగడ్డ-మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ₹84వేల కోట్లు వెచ్చిస్తే కాంగ్రెస్ తమ్మిడిహట్టి-ఎల్లంపల్లికి ₹35వేల కోట్లు కేటాయించిందని హరీశ్‌రావు విమర్శించారు. ‘కాళేశ్వరంతో 37లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనేది లక్ష్యమైతే, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47లక్షల ఎకరాలకే సాగు నీరట! ₹35వేల కోట్లతో కేవలం 4.47లక్షల ఎకరాలకు నీరివ్వాలనే ఆలోచన అద్భుతం. ఇది కదా అసలైన మార్పంటే?’ అని హరీశ్ సెటైర్ వేశారు.

News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.