News February 7, 2025

ఉట్నూర్: 9 నుంచి జాతర క్రీడాపోటీలు

image

ఉట్నూర్ మండలంలోని శ్యామ్ పూరులో బుడుందేవ్ జాతర అంగరంగవైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు రెండు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు మేనేజిమెంట్ సభ్యుడు పెందూర్ రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేస్తామన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరుకావాలని వారు కోరారు. 

Similar News

News March 24, 2026

ఆదిలాబాద్: ఈ నెల 31న జాబ్ మేళా

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైనా వారికీ నెలకు రూ.18-20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20సం.ల నుంచి 28సం.లలోపు గల యువకులు B.Sc / B.Com /BA (Fresher’s) వారు అర్హులని వివరించారు.

News March 24, 2026

ADB: క్రెడిట్ కోసం నిధుల యుద్ధం

image

ఆదిలాబాద్ జిల్లాలో నిధుల రాజకీయం సెగలు పుట్టిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి పనుల క్రెడిట్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. “నిధులు మేమే తెచ్చాం” అంటూ ఇరువర్గాలు పోటాపోటీగా శంకుస్థాపనలు చేస్తున్నాయి. ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు మండిపడుతుండగా, ప్రభుత్వ నిధులతోనే పనులు జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

News March 24, 2026

నిర్మల్: కొయ్యబొమ్మలకు జీవం పోసేలా..?

image

​నిర్మల్ జిల్లా గర్వకారణమైన కొయ్యబొమ్మల కళకు పూర్వవైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ‘పొనికి’ కర్ర కొరతతో ఈ పరిశ్రమ సంక్షోభంలో పడటంతో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో ఉపాధి హామీ పథకం ద్వారా ఎర్రమట్టి నేలల్లో పొనికి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో వీటిని పెంచడం ద్వారా కళాకారులకు ముడిసరుకు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యం.