News February 7, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచకపోతే రేవంత్ చిట్టా విప్పుతా: కృష్ణయ్య

బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి చిట్టా విప్పుతామని రాజ్యసభ ఎంపీ ఆర్?కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని కామెంట్ చేశారు. బీసీల అణచివేతకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు.
Similar News
News March 14, 2026
HYD: అనసూయపై అసభ్యకర మెసేజ్‌లు చేసింది ఇతడే!

నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో వేధింపులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జనార్థన్‌ను(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనసూయ మీద SMలో అసభ్యకరమైన మెసేజ్‌లు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
News March 13, 2026
HYDలో ‘హైడ్రా’కు సుప్రీం పవర్స్

హైడ్రాకు చట్టబద్ధమైన అధికారాలు కల్పించే ‘హైడ్రా చట్టం-2026’ ఈ బడ్జెట్ సెషన్‌లోనే ఆమోదం పొందనుంది. దీని ప్రకారం చెరువులు, నాలాల ఆక్రమణల విషయంలో హైడ్రా ఇచ్చే నోటీసులే తుది నిర్ణయంగా మారుతాయి. సివిల్ కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు రాకుండా మున్సిపల్ చట్టాల్లో కీలక సవరణలు చేస్తున్నారు. బడ్జెట్‌లో హైడ్రాకు అదనంగా ₹500 కోట్లు కేటాయించి సొంతంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీస్ ఫోర్స్’ను ఏర్పాటు చేయబోతున్నారు.
News March 13, 2026
ఉస్మానియా తరలింపు వెనక అసలు ప్లాన్ ఇదే!

ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల్లో అత్యంత కీలకం కానుంది. అఫ్జల్‌గంజ్‌లోని 26 ఎకరాల భూమిని ‘హెల్త్ టూరిజం’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం లోలోపల కసరత్తు చేస్తోందని సమాచారం. పాత వారసత్వ భవనాన్ని కేవలం మ్యూజియంగా మార్చి, మిగిలిన ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించే ప్రతిపాదన బడ్జెట్ ప్రసంగంలో ‘పరోక్షంగా’ వెల్లడికానుంది.


