News February 7, 2025
పలు ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే పరిశుభ్రంగా ఉండే బోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాల ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
Similar News
News March 11, 2026
యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ స్థలం పరిశీలించిన కలెక్టర్

యాదగిరిగుట్టలో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల స్థలాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం సందర్శించారు. కళాశాల భవన నమూనా మ్యాప్‌ను పరిశీలించిన ఆయన, పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. విద్యార్థులు, సిబ్బందికి అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాలేజీ అందుబాటులోకి వస్తే జిల్లాలో వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని కలెక్టర్ తెలిపారు.
News March 11, 2026
KNR: ప్రజాప్రతినిధులకు ‘ప్రగతి’ పాఠాలు

‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’పై కరీంనగర్ జిల్లా లోని సర్పంచ్, కార్పొరేటర్లకు (రేపు) గురువారం నిర్వహించనున్న శిక్షణను విజయవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. 10 ప్రధానాంశాలతో కూడిన 99 రోజుల కార్యాచరణ, విధివిధానాలు, ఆదాయ వనరుల పెంపుపై స్లైడ్లు, వీడియోలతో ఆకట్టుకునేలా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. జిల్లాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్నారు.
News March 11, 2026
త్వరలో కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి పనులు

కరీంనగర్ – జగిత్యాల మధ్య జాతీయ రహదారి (NH-563)ని నాలుగు వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. శంకుస్థాపన కోసం సమయం కేటాయించాలని కోరగా గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సుమారు రూ. 2,151 కోట్లతో 59 కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు.


