News February 7, 2025

అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాలు, స్టాక్ పాయింట్ల ద్వారా స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌లు స‌జావుగా జ‌రిగేలా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో పనిచేయాల‌ని అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప‌ర్యావ‌ర‌ణ‌, ఇత‌ర అనుమ‌తుల ఆధారంగా త‌వ్వ‌కాలు జ‌రిగేలా, స‌ర‌ఫ‌రాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు.

Similar News

News February 8, 2025

నల్గొండ: మాతా శిశుమరణాల రేటు తగ్గింపును సవాల్‌‌గా తీసుకోవాలి: కలెక్టర్

image

మాతా శిశుమరణాలను తగ్గించడాన్ని సవాల్‌గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి అన్ని రంగాలలో మనిషి ముందుకెళ్తున్నప్పటికీ అవగాహన లోపం, మూఢ నమ్మకాలతో అక్కడక్కడా ఇంకా మాతా శిశు మరణాలు నమోదవుతున్నాయని అన్నారు.

News February 8, 2025

సత్తా చాటిన తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు

image

అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పోలీసు స్పోర్ట్ మీట్‌లో తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు సత్తా చాటారు. దాదాపు 9 విభాగాలలో ప్రతిభ చూపినట్లు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. ట్రోపీలను, బహుమతులను అనంతపురం రేంజ్ డీఐజీ షిమోన్షి, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబు తదితరులు పాల్గొన్నారు.

News February 8, 2025

బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలి: నంద్యాల కలెక్టర్

image

జిల్లా వృద్ధిరేటును గణనీయంగా పెంచేందుకు, రుణాలు అందించడంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో బ్యాంకు మేనేజర్ల జిల్లా ఓరియంటేషన్ వర్క్ షాప్‌కు జిల్లా కలెక్టర్ అతిథిగా పాల్గొన్నారు. రుణాలు అందజేసి పేదరిక నిర్మూలనకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.

error: Content is protected !!