News February 7, 2025
ట్రైన్‌లో ప్రసవం.. పండంటి ఆడబిడ్డ జననం!

బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఓ గర్భిణి సహర్సాకు వెళ్తుండగా రైలులోనే పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కోచ్‌లోని ఇతర మహిళలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రసవానికి సహాయం చేశారు. దీంతో సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపేసి ఆమెను ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 10, 2025
APPLY NOW: జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/
News November 10, 2025
మరో బస్సు ప్రమాదం.. 30 మంది సేఫ్

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
News November 10, 2025
‘వెంటనే తొలగిస్తున్నాం’.. CEO సహా ఉద్యోగులకు HR మెయిల్!

HR డిపార్ట్‌మెంట్ చేసిన పొరపాటు గురించి ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మా కంపెనీ ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ టూల్‌ను టెస్ట్ చేస్తోంది. లైవ్ మోడ్ నుంచి టెస్ట్ మోడ్‌కు మార్చడాన్ని మర్చిపోయింది. దీంతో ‘మీ చివరి పని దినం వెంటనే అమల్లోకి వస్తుంది’ అని CEO సహా 300 మందికి ఈమెయిల్స్ వచ్చాయి. అయితే తప్పు తెలుసుకుని తర్వాత మరో మెసేజ్ చేసింది. ఎవరినీ తొలగించలేదని చెప్పింది’ అని రెడిట్‌లో రాసుకొచ్చాడు.


