News February 7, 2025
TPT: ఇటీవలే రిటైర్మెంట్.. అంతలోనే సూసైడ్

తిరుమలలో భార్యాభర్త <<15390232>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసుల నాయుడు(60) కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో పనిచేశారు. ఇటీవలే ఆయన రిటైరయ్యారు. శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఆయన తిరుమలకు వెళ్లి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను తిరుపతి రుయాకు తరలించారు.
Similar News
News July 6, 2025
రేపు ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో నకిలీ విత్తనాలతో పంటకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అనంతరం సీతక్క మంగపేట, ఏటూరునాగారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
News July 6, 2025
రాజమండ్రి : ప్రయాణికులకు గమనిక

ఆషాఢ మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏ.సీ బస్సు ధరలో 15% రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ డీఎం కె.మాధవ తెలిపారు. నేడు ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. రాజమండ్రి – హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ తక్కువ ధరకు ఇంద్ర ఏ.సీ బస్సులో ప్రయాణించ వచ్చుని అన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుత టిక్కెటు ధర రూ.1060లు కాగా రాయితీపై ధర రూ.920గా ఉందని చెప్పారు.
News July 6, 2025
JNTUలో కౌన్సెలింగ్.. విద్యార్థులకు కీలక సూచన

TG EAPCET 2025లో భాగంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి అధికారులు మరో కీలక సూచన చేశారు. కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులు సాయంత్రం 4 గంటల నుంచి వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు.