News February 7, 2025

వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ నియామకం

image

వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ కార్యవర్గ సమావేశం శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆచార్య రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పరుశరాములు, మహిళా విభాగానికి అధ్యక్షులుగా సంయుక్త, ప్రధాన కార్యదర్శిగా సరళను నియమిస్తూ సంస్థ ఛైర్మన్ మొహమ్మద్ సిరాజుద్దీన్ నియామక పత్రాలను అందజేశారు.

Similar News

News February 8, 2025

7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

image

AP: డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.

News February 8, 2025

MBNR: మన్యంకొండ గుట్టపైకి ఉత్సాహమూర్తి పల్లకి సేవ.!

image

శ్రీమన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కోట కదిర గ్రామంలోని అళహరి వంశీయుల ఇంటి నుంచి స్వామివారి ఉత్సవ మూర్తి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని కోటకదిర గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పల్లకి సేవలో పాల్గొన్నారు. రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా నిర్వహిస్తారు. ఆలయ ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News February 8, 2025

హన్మకొండ జిల్లాలో టాప్ న్యూస్ 2/2

image

* KUలో ఉద్రిక్తత.. చితకబాదుకున్న విద్యార్థులు!
* పరకాలలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన పీడీఎస్ బియ్యం
* త్యాగరాజ కీర్తనలు పాడిన HNK కలెక్టర్ ప్రావీణ్య
* ఉప్పల్‌లో మూడో రోజు కొనసాగిన ఆందోళన!
* పర్వతగిరి: ఖాళీ అవుతున్న చెక్ డ్యామ్‌లు.. పట్టించుకోండి!
* హనుమకొండలో ACB సోదాలు
* విద్యార్థులతో కలిసి భోజనం చేసిన HNK కలెక్టర్

error: Content is protected !!