News February 7, 2025
రేపటి లోగా బుమ్రా ఫిట్‌నెస్‌పై రిపోర్ట్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738919082686_782-normal-WIFI.webp)
భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్‌నెస్‌పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్‌తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News February 8, 2025
BPL-2025 విజేత ఫార్చూన్ బారిషల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738954550177_695-normal-WIFI.webp)
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఫైనల్లో చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చిట్టగాంగ్ 194/3 స్కోర్ చేయగా బారిషల్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. విజేతకు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. BPLలో మొత్తం ఏడు టీమ్‌లు పాల్గొన్న విషయం తెలిసిందే.
News February 8, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738948216523_695-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 8, 2025
‘స్కిల్ ఇండియా’కు రూ.8,800 కోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738950465241_695-normal-WIFI.webp)
దేశంలోని యువతకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రారంభించిన ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని 2026 వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రూ.8,800 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం కౌశల్ వికాస్ యోజన 4.O, జన్ శిక్షణ్ సంస్థాన్, PM-NAPS పథకాలను భాగం చేసింది. అలాగే జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది.