News February 7, 2025
కాళేశ్వరంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు

కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగు నీటి ఏర్పాటు, తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటుగా అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
Similar News
News September 18, 2025
డీఎస్సీ అభ్యర్థులను తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియమాక పత్రాల స్వీకరణకు అభ్యర్థులను తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బుధవారం అమరావతికి ప్రయాణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మెగా డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 19న అమరావతిలో సీఎం చేతుల మీదగా నియమాక పత్రాలు అందించడం జరుగుతుందన్నారు.
News September 18, 2025
బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బందోబస్తు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ప్రముఖులతో మర్యాదగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో మాత్రం కఠినంగా ఉండాలని సూచించారు. ఏవైనా ఆకస్మిక ఘటనలు జరిగినప్పుడు పక్క సెక్టార్లలోని పోలీసులు సహాయం అందించాలని చెప్పారు.
News September 18, 2025
శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు

హిందూ పురాణాల ప్రకారం నాలుగు యుగాల్లో విశ్వకర్మ ఎన్నో పట్టణాలను నిర్మించారని అదనపు ఎస్పీ కె.వి.రమణ అన్నారు. బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకులు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేశారు. ఆయుధాలతో పాటు పనిముట్లు ప్రాముఖ్యతను తెలిపిన గొప్ప వ్యక్తి విశ్వకర్మ అని ఆయన పేర్కొన్నారు.