News February 7, 2025

డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత: తిరుపతి SP

image

సమాజంలో డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉందని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కరకంబాడి రోడ్ ఫ్యాబ్ బిల్డింగ్‌లో మెడికల్ షాప్ యజమానులు, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ హరిప్రసాద్‌తో కలిసి ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ని నిర్మూలించే బాధ్యత అందరిదని గుర్తు చేశారు. భావి తరాలు చెడిపోకుండా అందరూ సహకరించాలని కోరారు.

Similar News

News February 8, 2025

మెదక్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన యువ అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు.

News February 8, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుగలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చిన విధంగానే భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం వస్తూ ఉంటాయి. పేదరికం, ఐశ్వర్యం శాశ్వతం కాదు.

News February 8, 2025

నిర్మల్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ పురస్కారం

image

వ్యాసరచన పోటీల్లో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం సాధించిన ఎస్ఐ జ్యోతిమణిని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల నగదు పురస్కారంతో అభినందించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఫ్లాగ్ డే పోటీలలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్ఐ జ్యోతిమణి రూ.15000 నగదును అందజేశారు. రాష్టస్థ్రాయిలో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు ఉన్నారు.

error: Content is protected !!