News February 7, 2025

పవన్ సిక్ అయ్యాడా.. అలిగాడా?: అంబటి

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ నిజంగానే అస్వస్థతకు గురయ్యాడా లేదా షూటింగ్‌లో ఉన్నాడా అని YCP నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌పై పవన్ అలిగాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్ ఒక్క హామీని నేరవేర్చలేదు. హామీలు అమలు చేయకుండా జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. కూటమి పాలనలో అన్నీ మోసాలు, దాడులు, అరాచకాలే. గ్యారంటీ ఇచ్చిన పవన్ కూడా అడ్రస్ లేడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News March 25, 2026

పవన్ సినిమాల్లో నటించొద్దని పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

image

AP: సినిమాల్లో నటించకుండా Dy.CM పవన్ కళ్యాణ్‌పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ‘హరిహరవీరమల్లు’ టికెట్ ధరల పెంపు విషయంలో చట్టనిబంధనలు అనుసరించలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ IAS అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. నిర్మాత అభ్యర్థన మేరకే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని.. సీఎం, మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని పవన్ తరఫు లాయర్లు వాదించారు.

News March 25, 2026

సమ్మర్ షాక్.. పెరగనున్న ACల ధరలు

image

ఈ వేసవిలో ACల ధరలు 8% నుంచి 12% వరకు పెరగనున్నాయి. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త BEE (Bureau of Energy Efficiency) ఎనర్జీ రేటింగ్ నిబంధనల వల్ల తయారీ ఖర్చు పెరిగింది. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో కాపర్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కంపెనీలపై భారాన్ని పెంచాయి. ఈ అదనపు వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు ధరలను పెంచుతున్నాయి.

News March 25, 2026

ఇందిరమ్మ ఇండ్లు.. లక్ష దాటిన శ్లాబులు

image

TG: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,13,365 ఇళ్ల శ్లాబులు పూర్తయినట్లు హౌసింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు లబ్ధిదారులకు ₹5,376.22 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం మరో 2.65 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వర్క్ ప్రోగ్రెస్‌ను బట్టి ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొంది.