News February 7, 2025

మేడిపల్లిలో హై వోల్టేజ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ..!

image

మేడిపల్లి పరిధిలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లో హై వోల్టేజ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ ఉన్నట్లుగా సైంటిస్టులు తెలిపారు. ఇందులో కేంద్ర వ్యాప్తంగా ఉన్న నిష్ణాతులైన ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఇందులో వివిధ రకాల పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక అవుట్‌డోర్ డీసీ టెస్టింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.

Similar News

News March 7, 2026

HYDలో హాకీ సమరం.. కెప్టెన్లకు ఘన స్వాగతం

image

హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న FIH మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్-2026 వేడుకలు మొదలయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనే భారత్, ఇంగ్లాండ్, కొరియా సహా 8 దేశాల కెప్టెన్లకు క్రీడా శాఖ అధికారికంగా స్వాగతం పలికింది. భారత జట్టుకు సలీమా టెటె నాయకత్వం వహిస్తుండగా.. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. భాగ్యనగరంలో అంతర్జాతీయ హాకీ సందడి నెలకొంది.

News March 7, 2026

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: DMHO సుజాత

image

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. శనివారం వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాధాశ్రమంలో మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులకు తేడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనాధ బాలల మధ్య ఈ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

News March 7, 2026

ASF: PM సూక్ష్మ ఆహార పరిశ్రమల పథకం ప్రారంభం

image

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంలో రాయితీ రుణాల ద్వారా ఆదాయ అభివృద్ధి జరుగుతుందని ఆసిఫాబాద్ DRDA దత్తారావు శనివారం తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు 35% రాయితీ, 65% బ్యాంకు రుణంతో పరిశ్రమలు స్థాపించుకోవచ్చని, 100 యూనిట్లు కేటాయించబడ్డాయని, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు.