News February 7, 2025
బిక్కనూర్: ప్రమాదాల నివారణకు చర్యలు: అడిషనల్ ఎస్పీ

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. శుక్రవారం బిక్కనూర్ మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఆమె పలు సలహాలు, సూచనలు చేశారు. ఆమె వెంట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Similar News
News March 17, 2026
GNT: అన్‌ఎయిడెడ్ స్కూల్ టీచర్లకు డీఈఓ ప్రకటన

గుంటూరు జిల్లాలోని అన్‌ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు డీఈఓ కీలక ప్రకటన చేశారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు www.deognt.blogspot.inను చూడొచ్చన్నారు. దరఖాస్తు దారులకు మార్చి 22న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు గుంటూరులో సర్టిఫికెట్ల పరిశీలన, డెమో క్లాసులు ఉంటాయని అధికారులు తెలిపారు.
News March 17, 2026
గుంటూరు: టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల

ఉమ్మడి గుంటూరు (D)లోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన తాత్కాలిక/జనరల్ సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితా DEO అధికార వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్న వారు సంబంధిత ఆధారాలతో మార్చి 22 లోపు గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పీల్ రిసీవింగ్ కమిటీకి సమర్పించాలని సూచించారు.
News March 17, 2026
RKL: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు బెస్ట్ ఇండియన్ గోల్డెన్ పర్సనాలిటీ అవార్డు

రాయికల్ పట్టణానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పడాల తిరుపతి బెస్ట్ ఇండియన్ గోల్డెన్ పర్సనాలిటీ అవార్డు దక్కించుకున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల బోటని విభాగాధిపతి ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్, మైక్రో బయాలజీ విభాగాధిపతి రౌతు రాధాకృష్ణలు సన్మానించారు. విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.


