News February 7, 2025

అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో పోలీసులకు ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం జిల్లా కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ ఎస్పీ ముందు హాజరై వారి వ్యక్తిగత అనారోగ్య సమస్యలను తెలిపారు. ఈ మేరకు విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Similar News

News April 9, 2026

తిరుమల లడ్డూలతో రూ.567 కోట్ల ఆదాయం

image

తిరుమలలో 2025-26 వార్షిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లడ్డూలు విక్రయించారు. మొత్తం 13.95 కోట్ల లడ్డూలను విక్రయించగా టీటీడీకి రూ.567 కోట్ల ఆదాయం సమకూరింది. రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేసి అదే స్థాయిలో విక్రయిస్తున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదానికి భారీ డిమాండ్ నెలకొంది.

News April 9, 2026

ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం.. ఎక్కడో తెలుసా?

image

నిజంగా ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం ఇస్తే ఎంత బాగుంటుందో కదా! స్పెయిన్‌లోని అరెనిల్లాస్ అనే గ్రామం ఫ్యామిలీస్‌కు ఈ ఆఫర్ ఇస్తోంది. అయితే స్కూలుకు వెళ్లే పిల్లలు ఉండాలని, శాశ్వతంగా అక్కడే నివసించాలని, విలేజ్ బార్ నడపాలని, మున్సిపల్ పని చేయాలని కండిషన్లు పెడుతోంది. ప్రస్తుతం అక్కడ 40 మందే ఉండటంతో జనాభా పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ప్రకటన చేయగానే 100 దరఖాస్తులు వచ్చాయట.

News April 9, 2026

ప.గో: మొన్న కిరణ్ రాయల్.. ఇప్పుడు జయప్రకాశ్ అంటూ YCP ట్వీట్

image

పశ్చిమగోదావరి జిల్లా జనసేన నేత, వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడిపై ఓ మహిళ చేసిన పలు ఆరోపణలపై YCP గురువారం ఎక్స్‌ వేదికగా స్పందించింది. మొన్న కిరణ్ రాయల్, ఆ తర్వాత అరవ శ్రీధర్, ఇప్పుడు జయప్రకాశ్ కూడా ఆడబిడ్డలను మోసం చేస్తున్నారని విమర్శించింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు గుప్పించింది.