News February 7, 2025
ఐదేళ్ల క్రితం రూ.8.7 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.2.4 కోట్లు!
స్టాక్ మార్కెట్లో విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. ఐదేళ్ల క్రితం 10వేల డాలర్లు(రూ.8.7లక్షలు) సేవింగ్స్ అకౌంట్లో భద్రపరిస్తే అది రూ.8.96 లక్షలు అయ్యేది. అదే డబ్బును స్టాక్ మార్కెట్లో Nvidiaలో ఇన్వెస్ట్ చేస్తే $285,000 (రూ.2.4కోట్లు), Bitcoinలో చేస్తే $220,000, Teslaలో చేస్తే $139,000 అయ్యేవి.
నోట్: ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు పాటించాలి.
Similar News
News February 8, 2025
కొత్త ఐటీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలిపాయి. ఈ చట్టంలో అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.
News February 8, 2025
హసీనా వ్యాఖ్యలతో భారత్‌కు సంబంధం లేదు: విదేశాంగ శాఖ
బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని భారత్‌లో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆమె వ్యాఖ్యలతో ఇండియాకు సంబంధం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తాము ఎప్పుడూ కృషి చేస్తామన్నారు. బంగ్లా అంతర్గత వ్యవహారాలను INDకు ముడిపెట్టడం సరికాదని ఆ దేశ అధికారులకు తేల్చిచెప్పారు.
News February 8, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుగలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చిన విధంగానే భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం వస్తూ ఉంటాయి. పేదరికం, ఐశ్వర్యం శాశ్వతం కాదు.