News February 7, 2025

పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE

image

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనుండగా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తొలుత ZPTC, MPTC ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

Similar News

News January 20, 2026

NALCOలో 110 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO)లో 110 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్- 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in

News January 20, 2026

ఇతిహాసాలు క్విజ్ – 129

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 20, 2026

‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

image

TG: ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.