News February 8, 2025

దిలావార్ పూర్: విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్ల బందోబస్తు పరిశీలన

image

ఈ నెల 8న నిర్వహించనున్న ధ్యాన హనుమాన్ భారీ శిల్ప విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను అదనపు ఎస్పీలు అవినాష్ కుమార్, ఉపేందర్ రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి వచ్చే భక్తులు వాహనాలు, సౌకర్యాలను తదితర విషయాలను కార్యక్రమా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 11, 2025

కూతురు తెచ్చిన అదృష్టం.. పావు కేజీ గోల్డ్ గెలిచాడు

image

బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ లాటరీలో 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్లుగా టికెట్ కొనుగోలు చేస్తున్న అతను ఈసారి తన కూతురి చేతుల మీదుగా టికెట్ తీసుకున్నారు. దీంతో అదృష్టం వరించింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని మంజునాథ్ చెప్పారు. తన కూతురి రూపంలో లక్ కలిసొచ్చిందని, ఆమె కోసం బహుమతి తీసుకుంటానని ఆయన తెలిపారు.

News November 11, 2025

నంద్యాల విద్యార్థినికి వైఎస్ జగన్ రూ.లక్ష ప్రోత్సాహకం

image

SSC-2025లో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించిన నంద్యాల విద్యార్థిని షేక్ ఇష్రత్‌ (599/600) మంగళవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఆమెను అభినందించి, రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. మహిళలు చదువుకుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుందని, ఉన్నత లక్ష్యంతో చదవాలని జగన్ ఇష్రత్‌కు సూచించారు.

News November 11, 2025

బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

image

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103