News February 8, 2025

130 కి.మీ వేగంవెళ్లేలా రైల్వేట్రాక్ అప్‌గ్రేడ్

image

విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలోని ట్రాక్‌ను గంటకు130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకీకరించనున్నారు. మెుత్తంగా 1,287 KM మేర ట్రాక్ అప్‌గ్రేడ్ చేయదలచగా ఇప్పటివరకూ 58శాతం మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజినీర్ వరుణ్‌బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించనున్నారు. నిడవదొలు -భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం, సామర్లకోట మార్గాల్లో ట్రాక్ అప్‌గ్రేడ్ పూర్తయిందని తెలిపారు.

Similar News

News February 8, 2025

కార్తీ ఖైదీ-2లో కమల్ హాసన్?

image

లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో కార్తీ హీరోగా ఖైదీ-2 మూవీ త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. లోకేశ్-కమల్ కాంబోలో 2022లో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో భాగంగానే ఖైదీ సీక్వెల్ కూడా ఉండనుంది.

News February 8, 2025

ఢిల్లీ దంగల్‌లో విజేత ఎవరు? నేడే కౌంటింగ్

image

దేశమంతా ఆసక్తి ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఉ.7గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా, ఏ పార్టీది గెలుపనేది మ.12కు క్లారిటీ రానుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద EC పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ప్రతి అప్‌డేట్‌ను WAY2NEWS మీకు ఎక్స్‌క్లూజివ్‌గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్‌లో చూడవచ్చు.

News February 8, 2025

ఉదయం లేవగానే రీల్స్ చూస్తున్నారా?

image

ఉదయం లేవగానే మొబైల్ పట్టుకుని రీల్స్ చూస్తే కార్టిసాల్ హార్మోన్ పీక్స్‌కి వెళ్లిపోయి రోజంతా స్ట్రెస్‌ ఫీలవుతారని డాక్టర్లు చెబుతున్నారు. దానికి బదులు సూర్యరశ్మి పడే ప్రదేశంలో కాసేపు నిల్చొని డే స్టార్ట్ చేస్తే చికాకు, స్ట్రెస్ దూరమవుతుందని అంటున్నారు. సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి రాగానే టీవీలో గొడవలు పడే న్యూస్ చూసేబదులు పిల్లలు, కుటుంబంతో సరదాగా మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని సూచిస్తున్నారు.

error: Content is protected !!