News February 8, 2025
7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.
Similar News
News April 17, 2026
ఆ తప్పులు సరిదిద్దేందుకే డీలిమిటేషన్: షా

దేశంలో 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని కేంద్రమంత్రి అమిత్ షా LSలో అన్నారు. ‘ఒక దగ్గర 38 లక్షల మంది ఓటర్లు ఉంటే మరో చోట 6 లక్షల మంది ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గాలు దేశంలో చాలా ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల ఇలాంటి తప్పులను సరిదిద్దవచ్చు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ కావాలనే డీలిమిటేషన్ ఆపింది. జనాభా లెక్కలకు డీలిమిటేషన్‌ను మేం లింక్ చేయలేదు. కాంగ్రెస్సే చేసింది’ అని స్పష్టంచేశారు.
News April 17, 2026
దిగుమతుల్లో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డ్

2025-26లో దేశంలో బంగారం, వెండి దిగుమతుల విలువ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతి విలువ $71.98 బిలియన్లకు పెరిగింది. అయితే పరిమాణం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులకు క్షీణించింది. వెండి దిగుమతి విలువ 150% పెరిగి $12Bకు (7,344.96 టన్నులు) చేరింది. మరోవైపు 15 బ్యాంకులకు గోల్డ్, సిల్వర్ దిగుమతులపై అనుమతిని 2029 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2026
2 రాష్ట్రాల ఎన్నికలు.. రూ.865 కోట్లు సీజ్

అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్, తమిళనాడులో ఇప్పటి వరకు రూ.865 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ECI వెల్లడించింది. ఇందులో రూ.99 కోట్ల నగదు, రూ.84 కోట్ల విలువైన 32.91 లక్షల లీటర్ల లిక్కర్ ఉన్నాయని తెలిపింది. అలాగే రూ.174 కోట్ల డ్రగ్స్, రూ.159 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.350 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు పేర్కొంది.


