News February 8, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.1,24,854 ఆదాయం

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,24,854 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.69,960, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,070, అన్నదానం రూ.9,824 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News March 21, 2026

కరీంనగర్: SI చంద్రశేఖర్ చివరి కోరిక ఇదే..!

image

కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్, అతడి <<19441898>>భార్య దివ్య మృతిని తట్టుకోలేక<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమెను దహనం చేసిన పక్కనే తనను కూడా దహనం చేయాలని ముందురోజే చెప్పాడని దివ్య తండ్రి సమ్మయ్య తెలిపారు. ఇల్లందకుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో ఈరోజు చంద్రశేఖర్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. భార్య చితి ఆరకముందే కన్న పిల్లల్ని వదిలి చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలిచి వేసింది.

News March 21, 2026

చిత్తూరు: ఐదుగురు DTలకు విధులు

image

గ్రూప్-2 పరీక్షల్లో DTలుగా ఎంపికైన వారిలో 16 మందిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 5 మందిని కేటాయించగా వారిలో.. శివకుమార్, మదన్ మోహన్ రెడ్డి, యస్థాని బాషా, సుధాకర్, శశికిరణ్ ఉన్నారు. వీరు ఏడాది పాటు రెవెన్యూ విభాగంలో ప్రొబేషన్ కింద జిల్లాలో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

News March 21, 2026

అన్నమయ్య: ‘గ్యాస్’ సమస్యలా.. కాల్ చేయండి..!

image

అన్నమయ్య జిల్లాలోని 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు జేసీ శివ నారాయణ శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలతో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమస్యలపై 08571-293001కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.