News February 8, 2025

KMR: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూంలను పరిశీలించారు. ప్రతీ రోజు వంట గదిని శుభ్ర పరచాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఫిజికల్ ఫిట్నెస్, భోజనం, తదితర విషయాలపై ఆరా తీసి వారికి దిశా నిర్దేశం చేశారు.

Similar News

News March 11, 2026

పాలమూరు: ఈనెల 16న ఖో ఖో క్రీడాకారుల ఎంపిక

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న మహిళలు, 17న పురుషుల ఖో ఖో జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. వర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థులు (17-25 ఏళ్ల వారు) పాల్గొనవచ్చు. ఇక్కడ ఎంపికైన వారు ఆల్ ఇండియా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన పేర్కొన్నారు.

News March 11, 2026

రేపు సూర్యాపేట జిల్లాకు రానున్న మంత్రి ఉత్తమ్

image

రేపు (మార్చి 12) మధ్యాహ్నం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేటలో సాయిబాబా టెంపుల్ సమీపంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు.
అనంతరం హుజూర్నగర్ నియోజకవర్గంలో 2160 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించి అధికారులతో చర్చించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.

News March 11, 2026

రైల్వేపై LPG ప్రభావం.. ఫుడ్ డెలివరీలో అంతరాయం!

image

భారత్‌లో LPG కొరత రైల్వే వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది. రైళ్లలో భోజన సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ ఆర్డర్ చేసినవారికే ప్రయారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అటు ప్రత్యామ్నాయ వంట పద్ధతులకు మారాలని స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్, జన్ ఆహార్ అవుట్‌లెట్లకు IRCTC లేఖ రాసింది. ఈ సంస్థ రోజుకు 17 లక్షల భోజనాలు డెలివరీ చేస్తోంది.