News March 19, 2024
ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని కవిత రిట్ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈడీ కస్టడీ నుంచి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె అందులో కోరారు. కాగా ఇటీవల కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఈనెల 23 వరకు కస్టడీ విధించింది.
Similar News
News January 7, 2026
సచిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ పెళ్లి డేట్ ఫిక్స్!

సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్ పార్ట్నర్, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి మార్చి 5న జరగనున్నట్లు TOI పేర్కొంది. 2025 ఆగస్టులోనే వీరి నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగింది. మార్చి 3 నుంచి ముంబైలో పెళ్లి వేడుకలు షురూ కానున్నాయి. ఇటీవలే అర్జున్ నిశ్చితార్థాన్ని సచిన్ ధ్రువీకరించారు.
News January 7, 2026
₹5800 CRతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 KM మేర నదిని సుందరీకరణ చేస్తారు. ముందుగా నదిలో పూడిక తీసి తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఆపై గోదావరి నీరు ప్రవహించేలా ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News January 7, 2026
పసుపు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

పసుపు రకాన్ని బట్టి పంట కాలం 7 నుంచి 9 నెలలుగా ఉంటుంది. పసుపు పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోత కోయడం ప్రారంభించాలి. పక్వానికి రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతే పంట కాలం పూర్తి అయ్యిందని గుర్తించవచ్చు. ఈ దశలో దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.


