News February 8, 2025

NGKL: కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జూపల్లి

image

ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూచ తప్పకుండా అమలు చేస్తున్నామ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. శుక్ర‌వారం కొల్లాపూర్ మండ‌ల రెవెన్యూ కార్యాలయంలో వీప‌నగండ్ల‌, మండలానికి చెందిన ల‌బ్ధిదారుల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 22, 2026

TTDకి రూ.కోటి విరాళం అందజేత

image

చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు దాత జే.రాజా రమేశ్ తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.

News March 22, 2026

‘జిల్లాలో 6,027 సిలిండర్లు అందుబాటులో’

image

జిల్లాలో 6027 గ్యాస్ సిలిండర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ భాషా ఆదివారం తెలిపారు. జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలను తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టారన్నారు. ఎక్కడైనా గ్యాస్ అక్రమంగా విక్రయించినా, బరువులో తేడాలు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.

News March 22, 2026

కడప జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

image

పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.