News February 8, 2025

సుగమ్య భారత్ యాత్రను ప్రారంభించిన ప్రకాశం కలెక్టర్

image

సమాజంలో దివ్యాంగులకు కూడా నూతన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. విభన్నుల ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను శుక్రవారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్‌తో పాటు రాష్ట్ర విభన్న ప్రతిభా వంతులశాఖ డైరక్టర్ రవిప్రకాశ్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు.

Similar News

News March 28, 2026

మార్కాపురం బస్సు ప్రమాదం.. పరారీలో ఉన్న యజమాని అరెస్ట్

image

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాద సమయంలో బస్సు యజమాని హరికృష్ణే వాహనాన్ని నడిపినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ప్రమాదం తర్వాత పరారైన అతడిని కనిగిరిలో అరెస్టు చేసి మార్కాపురం తరలించారు. కాలం చెల్లిన బస్సు కావడం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

News March 27, 2026

మార్కాపురం జిల్లాలో ఆ బస్సులు చాలా డేంజర్..!

image

మార్కాపురం ప్రమాదంతో నెల్లూరు (D) కలిగిరికి చెందిన <<19487686>>హరికృష్ణ <<>>ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన డొక్కు బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని సమాచారం. వాటిపై పాత ట్రావెల్స్ పేర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రయాణ సమయంలో తరచూ రిపేర్లకు గురవుతుంటాయని.. చాలాసార్లు మార్గమధ్యంలోనే బస్సులను మారుస్తుంటారని అందులో ప్రయాణించిన వాళ్లు చెబుతున్నారు.

News March 27, 2026

చీమకుర్తి వద్ద ప్రమాదం.. విద్యార్థి స్పాట్‌డెడ్

image

చీమకుర్తి బైపాస్‌లో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై వేగంగా వస్తున్న ముగ్గురు స్కూల్ విద్యార్థుల బైక్ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, గాయపడిన వారు చీమకుర్తిలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.